కుమారుడి హత్య.. ప్రతీకార హత్య
తమ కుమారుడిని చంపిన నిందితుడిని కుటుంబసభ్యులు వెంటాడి మరీ చంపారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చిన్నచెల్మెడలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తలారి ప్రవీణ్‌ను బేగరి ఆనంద్ హత్య చేశాడు. ఏడాది జైలు జీవితం అనంతరం ఆనంద్ బయటికొచ్చాడు. శుక్రవారం చిన్నచెల్మెడ వచ్చిన ఆనంద్‌ను అదును కోసం చూస్తున్న ప్రవీణ్ కుటుంబసభ్యులు వెంటాడి మరీ చంపేశారు. కళ్లలో కారం చల్లి, గొడ్డళ్లతో నరికి చంపారు. నిందితులు బుధేరా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.