• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 28నుంచి ఖాతాల్లో రైతుబంధు

  తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచే రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రి మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంక్రాంతి వరకల్లా యాసంగి రైతుబంధు నిధుల జమ ప్రక్రియ పూర్తికావాలని సూచించారు. ఈ మేరకు సుమారు రూ.7,600 కోట్లు ఖర్చు వెచ్చించనున్నారు. ఆరోహణా క్రమంలో రైతులకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. తొలుత ఒక ఎకరం ఉన్నవారితో నిధుల జమ మొదలవుతుంది. పెట్టుబడి సాయం కింద ఏటా రెండు దఫాలు రైతుబంధు … Read more

  28నుంచి ఖాతాల్లో రైతుబంధు

  తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచే రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రి మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంక్రాంతి వరకల్లా యాసంగి రైతుబంధు నిధుల జమ ప్రక్రియ పూర్తికావాలని సూచించారు. ఈ మేరకు సుమారు రూ.7,600 కోట్లు ఖర్చు వెచ్చించనున్నారు. ఆరోహణా క్రమంలో రైతులకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. తొలుత ఒక ఎకరం ఉన్నవారితో నిధుల జమ మొదలవుతుంది. పెట్టుబడి సాయం కింద ఏటా రెండు దఫాలు రైతుబంధు … Read more

  400 కి.మీ, 200 కిలోలు, రూ. 8 లాభం

  కర్ణాటకలో ఉల్లిగడ్డ సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓ రైతు 200 కిలోల ఉల్లిని అమ్మితే అతడికి వచ్చిన లాభం కేవలం రూ. 8. ఇందుకోసం అతడు 400 కిలోమీటర్లు ప్రయాణించాడు. గోదాగ్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన హలికేరి పంట విక్రయించేందుకు వెళ్లాడు. 205 కిలోల పంట అమ్మతి రూ. 410 రవాణా, కూలీ ఖర్చులు పోనూ అతడికి కేవలం రూ.8.35 పైసలు మిగిలాయి. కొద్దిరోజుల క్రితం క్వింటాల్ కు రూ. 500 ఉన్న ఉల్లిగడ్డ రేటు..ప్రస్తుతం సగం కంటే … Read more

  అన్నదాతలకు ఆపన్నహస్తం

  ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు ఏపీ సర్కార్ అండగా నిలువనుంది. లడ్డుప్రసాదం కోసం టీటీడీ సహా ఇతర ఆలయాలకు పంపిణీ చేసే వారికి కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ప్రీమియ రేటు దక్కేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన 100 మంది రైతులతో తిరుమలలోని శ్వేతభవన్‌లో శుక్రవారం సమావేశం కానున్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో సాగు మెళకువలతో పాటు సర్టిఫికేషన్‌ పొందేందుకు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నారు.

  రైతులను పక్కదారి పట్టించొద్దు: మంత్రి

  AP: తప్పుడు కథనాల ద్వారా రామోజీరావు రైతులను పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రోజుకో అబద్ధాన్ని స్టోరీలాగా రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే 48గంటల్లోనే కొత్తది ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఇలా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రైతులు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుందని ఆయన తెలిపారు.

  మిరప రైతులకు ఆశలు

  AP: గతేడాది మిగిల్చిన చేదు అనుభవాల నుంచి మిరప రైతులు కోలుకుంటున్నారు. ఈ ఏడాది మిరప సాగు లక్ష్యాన్ని మించింది. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో మిరప రైతుల్లో ఆశలు చిగురించాయి. తెగుళ్ల బెడద కూడా లేకపోవడంతో అన్నదాతలకు మిరప లాభాన్ని తెచ్చిపెట్టనుంది. ఏ ఏడాది హెక్టారుకు 40-50 క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా. గతేడాది అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి 20 క్వింటాళ్లకే పరిమితమైంది. ప్రస్తుతం సాధారణం మిరప రకం రూ.23-25 వేలు పలుకుతోంది. డిమాండ్ ఏర్పడితే ఇదే ధర … Read more

  జులై 31 నాటికి ఈ-కేవైసీ పూర్తి చేయ‌క‌పోతే రూ.6 వేలు రావు

  కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ యోజ‌న ప‌థ‌కం ద్వారా దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు ఏడాదికి మూడు సార్లు రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ డ‌బ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 11విడ‌త‌ల డ‌బ్బును కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అయితే 12వ విడ‌త కోసం రైతులు మ‌రోసారి ఈ-కేవైసీ పూర్తిచేయాలి. దీనికోసం జులై 31 చివ‌రి తేది. కేవైసీ పూర్తి చేయ‌క‌పోతే కిసాన్ యోజ‌న డ‌బ్బు రాదు. రైతులు చేయాల్సింద‌ల్లా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ-కేవైసీ ఆప్ష‌న్ … Read more

  రైతులకు అలెర్ట్.. వెంటనే ఈ-కేవైసీ చేసుకోండి

  కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. మూడు విడుడతల్లో రూ.2000ల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే కొందరు రైతులు ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో వారి ఖాతాలల్లోకి నగదు పడడం లేదు. అలాంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ-కేవైసీ చేసుకొని రైతులు జులై 31వ తేదీలోపు దగ్గర్లోని మీసేవ కేంద్రానికి లేదా pmkisan.gov.in వెబ్‌సైట్‌లో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

  నేటి నుంచే రైతుల అకౌంట్లలోకి డబ్బులు

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు నిధులు నేడు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. 68 లక్షల పైచిలుకు రైతుల ఖాతాల్లోకి వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల, 43 వేల 606 ఎకరాలకు సాయం అందిచనున్నట్లు వ్యవసాయ మంత్రి తెలిపారు. మొదటగా తక్కువ భూమి ఉన్నవారికి తర్వాత ఎక్కువ భూములు ఉన్న వారికి నిధులు జమకానున్నాయి.

  మద్దతు ధరలను పెంచిన కేంద్రం

  కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు అందజేస్తున్న మద్దతు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 17 పంటలకు మద్దతు ధరలను పెంచింది. – క్వింటాల్ కందులపై రూ. 300 పెంపు – క్వింటాల్ పెసర్లపై రూ. 480 పెంపు – క్వింటాల్ నువ్వులకు రూ. 523 పెంపు – పొద్దుతిరుగుడుపై రూ. 385 పెంపు – సోయాబీన్ పై రూ. 300 పెంపు