• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్లియర్ చేసిన తండ్రీకొడుకులు

    ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన తండ్రీకొడుకులు ఔరా అనిపిస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఇద్దరూ పాసై మెయిన్స్‌కు ఎంపికయ్యారు. బ్రహ్మణపల్లి ZPHSలో HMగా పనిచేస్తున్న దాసరి రవికిరణ్, ఆయన కుమారుడు మైఖేల్‌ ఇద్దరూ ఒకేసారి అర్హత సాధించారు. రిజర్వేషన్‌ కోటాలో అయిదేళ్లు, ఇన్‌సర్వీస్‌ కోటాలో అయిదేళ్ల మినహాయింపు ఉండటంతో 52 ఏళ్ల వయసులోనూ రవికిరణ్‌ గ్రూప్‌1 పరీక్షకు అర్హులయ్యారు.

    డ్యాన్స్‌ చేస్తూ కొడుకు..అది చూసి తండ్రి మృతి

    మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ వేడుకలో గర్భాలో నృత్యం చేస్తూ 35 ఏళ్ల వ్యక్తి కుప్పకూలాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తండ్రి అక్కడికక్కడే గుండె పోటుతో ప్రాణాలు వదిలాడు. శని, ఆదివారాల మధ్య రాత్రిలో ఇది జరిగింది. కుమారుడు కుప్పకూలగానే తండ్రే ఆసుపత్రికి తరలించాడని, తన చేతుల్లోనే కుమారుడు చనిపోవడంతో ఆయన తట్టుకోలేక గుండె ఆగిపోయిందని పోలీసులు తెలిపారు.