TS: కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం
తెలంగాణలోని కామారెడ్డిలో ఒక వ్యక్తికి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. బాదితుడిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 6న ఆ వ్యక్తి కువైట్ నుంచి కామారెడ్డి వచ్చాడు. జులై 20న అతడికి జ్వరం రాగా..జులై 23న శరీరంపై దద్దుర్లను గుర్తించిన వైద్యులు అది మంకీపాక్స్‌గా అనుమానిస్తున్నారు. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. కేరళలో ముగ్గురికి, నేడు ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ సోకినట్లు వెల్లడించారు.