• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్జెంటీనా గెలుపు.. ఫ్రీగా 1,500 బిర్యానీలు

    ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన సందర్భంగా ఓ వ్యక్తి 1,500 బిర్యానీలు ఉచితంగా పంచాడు. కేరళలోని త్రిశూర్ జిల్లాలోని పల్లిమూలకు చెందిన శిబు హోటల్ నిర్వహిస్తున్నాడు. అర్జెంటీనా అభిమాని అయిన ఆయన ఆ జట్టు గెలవగానే 1,500 చికెన్ బిర్యానీలు ఉచితంగా పంచాడు. దీంతో ఆయన హోటల్‌కు జనాలు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఉచితంగా బిర్యానీలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిబు ప్రకటించాడు.

    దద్దరిల్లిన అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్

    ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు హంగామా చేశారు. ప్లేయర్లందరూ కలసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ డైనింగ్ టేబుల్‌పై డ్యాన్స్ చేశాడు. ఒకరిపై ఒకరు షాంపేన్ జల్లుకుంటూ సందడి చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ బిజీబిజీగా గడిపారు. ట్రోఫీని ముద్దాడటానికి ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    మెస్సీ మ్యాజిక్ గోల్స్ చూశారా?

    అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల సాకారమైంది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠ పోరులో ఇరు జట్లు 3-3 గోల్స్ చేయడంతో షూటౌట్‌కు దారి తీసింది. అర్జెంటీనా షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. అర్జెంటీనా తరఫున్ మెస్సీ 2 కళ్లు చెదిరే గోల్స్ కొట్టాడు. మరో వైపు ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపే 3 గోల్స్‌తో పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని గోల్స్‌ను మీరూ చూసేయండి.

    సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

    అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. … Read more

    సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

    అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. … Read more

    అర్జెంటీనా అధ్బుత పోరాటం

    ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఉత్కంఠ [విజయం](url) సాధించింది. చివరి వరకూ పట్టు విడవకుండా పోరాడి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గట్టెక్కింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు కూడా 2 గోల్స్ కొట్టడంతో మ్యాచ్ సమమైంది. దీంతో ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ??❤️ Another game closer… — FIFA World Cup … Read more

    మైదానంలోకి మద్యం తీసుకెళ్లేందుకు పాట్లు

    ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న స్టేడియం పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన వేళ ఓ [వీడియో](url) వైరల్ అవుతోంది. మెక్సికో చెందిన ఓ అభిమాని తన బైనాక్యులర్స్ లో మద్యం తీసుకువచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని చెక్ చేశారు. ముందు బైనాక్యులర్స్ అని వదిలేసినప్పటికీ..తర్వాత అనుమానంతో పరిశీలించారు. అందులో మద్యం నింపుకొని మూతలు పెట్టి తీసుకువచ్చాడు. శానిటైజర్ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. A Mexico fan tried to to sneak in alcohol in binoculars and still … Read more

    మరోసారి ఆకట్టుకున్న జపాన్ ఫ్యాన్స్

    ఫుట్‌బాల్ స్టేడియంలో చెత్త ఏరి జపాన్ ఫ్యాన్స్ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2-1 తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్న జపాన్ ఫ్యాన్స్.. స్టేడియంలో ఉన్న పేపర్లు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లను ఏరి బయటికి తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఫిఫా వరల్డ్‌కప్ ఇంటర్నెట్‌లో పెట్టింది. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జపాన్ ఫ్యాన్స్ పరిశుభ్రతకు అందరూ ఫిదా అవుతున్నారు. Tidying up after one of their … Read more