• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయాలు

    సినిమా పరిశ్రమ విషయంలో చర్చలు జరుపుతున్న ఫిిల్మ్‌ చాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ ఇచ్చేలా నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేతన సమస్యలపైనా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో షూటింగులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

    త్వ‌ర‌లోనే షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాం

    సినిమా షూటింగ్‌ల బంద్ నేప‌థ్యంలో నేడు ఫిల్మ్‌ఛాంబ‌ర్ స‌భ్యులు మ‌రోసారి భేటి అయ్యారు. ఆ త‌ర్వాత మీడియతో మాట్లాడారు. చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నాలుగు క‌మిటీల‌ను ఏర్పాటు చేశాం. ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, నిర్మాణ వ్య‌యాలు, కార్మికుల వేత‌నాల‌పై క‌మిటీలు లోతుగా విశ్లేషిస్తున్నాయి అని తెలిపారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం షూటింగ్‌ల‌ను ఆపేశాం. మా నిర్మాతల‌ మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని సి.క‌ళ్యాణ్ తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. నాకు వ్య‌క్తిగ‌త అజెండాలేమీ లేవు. షూటింగ్‌లు ఎక్కువ కాలం ఆపే ఉద్దేశం లేదు. … Read more