అటవీ అధికారి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి పట్ల CM కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ వయసు ముగిసేవరకూ కుటుంబానికి పూర్తి జీతం అందిస్తామని బరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులను సహించబోమని సీఎం స్పష్టం చేశారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.