తగ్గని 14కేజీల సిలిండర్ ధర
గృహ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి మొండి చేయి చూపాయి. వరుసగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నా.. గృహ వినియోగ సిలిండర్ ధరలను యాథాతథంగా ఉంచుతున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్‌పై రూ.115ని తగ్గించాయి. గత నెలలో కూడా ఈ రకం సిలిండర్ ధరను తగ్గించాయి. కానీ, 14కేజీల సిలిండర్ ధర మాత్రం అలాగే కొనసాగుతోంది. దీంతో గృహ వినియోగదారులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. ప్రస్తుతం 14కేజీల సిలిండర్ ధర రూ.1105గా కొనసాగుతోంది.