సీఐడీ పోలీసులకు గోరంట్ల ఫిర్యాదు
AP: న్యూడ్ వీడియో వ్యవహారంపై ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు మార్ఫింగ్ వీడియోను టీడీపీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లేఖ రాశారు. ఐటీడీపీలో చంద్రబాబు, లోకేశ్, చింతకాయల రవి ఉన్నట్లు చెప్పారు. తాను జిమ్ చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోగా చిత్రీకరించారని ఫిర్యాదు చేశారు. గోరంట్ల ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు FIR నమోదు చేశారు.