నేటి నుంచే గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 4 దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 23 నుంచే దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఈనెల 30 నుంచి స్వీకరిస్తున్నారు. జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ 4లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు అధికారుల పోస్టులు 1,862, జూనియర్ అకౌంటెంట్ 429, జూనియర్ ఆడిటర్ 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.