తగ్గిన జీఎస్టీ.. తగ్గించని వ్యాపారస్తులు
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గినా వ్యాపారస్తులు తగ్గించడం లేదు. దీంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం 210 నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించింది కేంద్రం. తొలుత 28 శాతం ఉన్న జీఎస్టీ, 18గా, 18 నుంచి 12గా, 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. కానీ వ్యాపారులు తగ్గిన రేట్ల ప్రకారం విక్రయించడం లేదు. దీంతో ప్రజలపై అధిక భారం పడుతోంది. తగ్గిన పన్ను ప్రకారం ధరలు తగ్గించకుండా అసలు ధరలో కలిపేసి అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.