ఇంటి అద్దెకు జీఎస్టీపై కేంద్రం క్లారిటీ
ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీపై పలు కథనాలు వెలువడుతున్న వేళ కేంద్రం స్పష్టతనిచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం అద్దెకు తీసుకునేవారు జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం వ్యాపారానికి ఉపయోగించే ఇళ్లపైనే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. జీఎస్టీ రిజిస్టర్ అయిన వ్యక్తులకు పన్ను వర్తిస్తుందన్న వార్తలను కూడా కొట్టివేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుంటే వ్యాపారులకైనా జీఎస్టీ ఉండదని క్లారిటీ ఇచ్చింది.