భారతీయులకు గుడ్ న్యూస్
భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మార్చి 1 నుంచి హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వీసాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. మార్చి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అనంతరం లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తులు ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తామని వివరించింది. కాగా ఏడాదికి 85 వేల హెచ్1బీ వీసాలను భారతీయులకు అమెరికా మంజూరు చేస్తుంది.