• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గంగూలీకి మమతా మద్దతు

    ఐసీసీ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ పోటీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. శరద్ పవార్, జగ్మోహన్ దాల్మియాలను ఐసీసీలోకి పంపగా లేనిది, గంగూలీని ఎందుకు పంపడంలేదని మండిపడ్డారు. ఆమె పరోక్షంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాలపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్లకు అక్టోబర్ 20 చివరి తేది అయినా పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

    ఐసీసీ చైర్మన్ ఎన్నిక కమిటీలో VVS లక్ష్మణ్, డేనియల్ విటోరి

    ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. దీంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. అయితే కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేందుకు 16 మందితో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయగా.. అందులో VVS లక్ష్మణ్, డేనియల్ విటోరి ఉన్నారు. కాగా కొత్తగా నియామకమైన చైర్మన్ పదవీ కాలం డిసెంబర్ 1వ తేదీ 2022 నుంచి నవంబర్ 30వ తేదీ 2024 వరకు ఉంటుంది.