వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్లో దిగజారిన భారత్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23కు గాను ICC పలు జట్ల పాయింట్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో 70 శాతం సక్సెస్ రేటుతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 60 శాతంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. ఇక 53.33 శాతంతో శ్రీలంక మూడో ప్లేస్ సాధించగా, ఇండియా 52.08 శాతంతో నాలుగో ప్లేస్ చేరింది. పాకిస్తాన్ 51.85 శాతంతో 5వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 10 మ్యాచ్లలో 6 విజయాలు సాధించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.