• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇండియన్-2’పై క్రేజీ అప్డేట్

    విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ డబ్బింగ్ చెబుతున్న ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. దీంతో మూవీ షూటింగ్ డబ్బింగ్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

    ‘ఇండియన్2’లో డింపుల్ ఐటెమ్ సాంగ్!

    టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. క్రేజీ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఇండియన్2’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో డింపుల్ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో కమల్‌హాసన్ కూడా స్టెప్స్ వేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సాంగ్‌తో డింపుల్ దశ తిరిగినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా డింపుల్ ఇంతకుముందు ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. డింపుల్ నటించిన ‘రామబాణం’ మూవీ ఇటీవలే విడుదలైంది.