త్రిపుర టీమ్‌కు మెంటార్‌గా సాహా!
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమన్ సాహా కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సాహా దేశవాళీ బెంగాల్ జట్టును కూడా విడిచిపెట్టాడు. అతడు త్రిపుర జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతే కాకుండా ఆ టీమ్ కు మెంటార్ గా కూడా సాహా వ్యవహరించనున్నట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన సాహా ఆ ప్రాంచైజీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.