• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మా బ్యాటర్లు తేలిపోయారు: బట్లర్

    టీమిండియా చేతిలో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్‌ బట్లర్‌ అన్నాడు. స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తామని భావిస్తే పాత కథే రిపీట్ అయ్యిందని విచారం వ్యక్తం చేశాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న బట్లర్‌.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడతామని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

    బౌలర్లు అద్భుతం చేశారు: రోహిత్

    ఇంగ్లాండ్‌పై విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతా బ్యాటర్లు వికెట్‌ సమర్పించారని పేర్కొన్నాడు. ‘జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్‌ ఇది. బ్యాటింగ్‌లో అనుకున్నంతమేర రాణించలేదు. 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది. కానీ, భారత బౌలింగ్‌ విభాగం అద్భుతం చేసింది. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదురుకోనివ్వలేదు. మా బౌలర్ల అనుభవం కలిసొచ్చింది’ అని రోహిత్ చెప్పాడు.

    ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

    ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో గెలుపొందింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు. దూకుడుగా బౌలింగ్ చేసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ చేశారు. షమీ 4 వికెట్లు పడగొట్టగా బుమ్రాకు 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ సాధించాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి … Read more

    రోహిత్ శర్మ అరుదైన ఘనత

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 87(107) పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 18వేల పరుగుల మార్కును క్రాస్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు సచిన్(34,357), కోహ్లీ(26,421), ద్రవిడ్(24,208), గంగూలీ(18,575) ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. 40 పరుగులకు 4 వికెట్లు తీశారు.

    ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

    ఇంగ్లాండ్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్ల తెలుస్తోంది. ప్లాక్టిస్ సేషన్‌లో రోహిత్ మణికట్టుకు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్‌ మ్యాచ్‌కు రాకుంటే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇంగ్లాండ్‌పై గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఇప్పటికే స్టార్ అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

    హమ్మయ్య.. రోహిత్ శర్మకు ఏం కాలేదు..!

    ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ పోరు జరగనున్న నేపథ్యంలో ఓ ఘటన భారత అభిమానులను కలవర పెట్టింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి బంతి తగిలింది. ఈ క్రమంలో నెట్స్‌లోనే రోహిత్ విలవిలలాడాడు. దీంతో అతడి గాయంపై సందేహాలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తు రోహిత్ త్వరగానే కోలుకుని తిరిగి నెట్స్‌లోకి వచ్చాడు. అతడు మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అటు అభిమానులు, ఇటు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నట్టయింది. BREAKING:Good news … Read more