• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వాస్తవికతను అర్థం చేసుకోండి: నారాయణ మూర్తి

  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అవినీతి, చెత్త రహదారులు, కాలుష్యంతో పాటు చాలాసార్లు అధికారం లేకపోవటం వాస్తవికత అన్నారు. అదే సింగపూర్‌లో శుభ్రంగా కనిపించే రోడ్లు, కాలుష్యం లేకపోవటం, చేతిలో అధికారం అక్కడ వాస్తవిక పరిస్థితులని చెప్పారు. జీఎంఆర్‌ఐటీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవికతను సృష్టించుకోవటం మన అందరిపై ఉన్న బాధ్యతని పేర్కొన్నారు.

  దేశానికి యువతే కీలకం: నారాయణమూర్తి

  యువత నిజాయితీగా పనిచేస్తేనే దేశం ఉన్నత స్థితిలో ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు. వాళ్లే మార్గదర్శకులు అవుతారని చెప్పారు. ఇలా శ్రమించిన వారే విదేశాల్లో మన దేశ రాయబారులుగా ఉన్నారని పేర్కొన్నారు.“ కెరీర్ ను ఎంచుకోవటం, దానిపై అమితంగా శ్రమించడం, అందులో ఉన్నతస్థితి సాధించడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. దేశం గెలిస్తేనే మీరు గెలుస్తారని గుర్తు పెట్టుకోవాలి. నేను కలలు కన్న భారత్ ను యువత సాధిస్తారని నమ్ముతున్నా “ అన్నారు.

  రూ.10వేల అప్పుతో ఇన్ఫోసిస్ ప్రారంభం!

  ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటై 40 ఏళ్లు పూర్తయింది. అయితే, ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి నారయణమూర్తి రూ.10వేల అప్పు చేశారట. అదీ తన భార్య సుధా మూర్తి వద్దే కావడం విశేషం. అలా రూ.10వేలతో ప్రారంభమై నేడు రూ.17వేల కోట్ల సంస్థగా ఎదిగిందని సుధా మూర్తి గుర్తు చేసుకున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. తమ అల్లుడు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ‘అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? … Read more

  భారత పరిశోధన రంగానికి మచ్చ : నారాయణమూర్తి

  జాంబియా దేశంలో 66 మంది చిన్నారుల మరణానికి భారత్ లో తయారైన దగ్గు మందు కారణమనే ఆరోపణలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఘాటూగా స్పందించారు. ఇలాంటి ఆరోపణలు దేశానికే సిగ్గుచేటన్నారు. కరోనా టీకాలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసినప్పటికీ దగ్గు మందు అపవాద మచ్చ తెచ్చేదంటూ వ్యాఖ్యానించారు. దేశంలో చాలావరకు గన్యా, డెంగీ సమస్యతో బాధపడుతున్నా… మందు కనుగోలేకపోవటం వైఫల్యమేనన్నారు.

  ‘మామ అంటే గౌరవం.. కొంచెం భయం’

  ఎంపీగా గెలుపొందిన ఏడేళ్లకే బ్రిటన్ ప్రధాని పీఠాన్ని రిషి సునాక్‌ అధిరోహించారు. అయితే, తొలినాళ్లలో ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మామ నారాయణమూర్తి గురించి ప్రస్తావించారు. ‘ఆయనంటే చాలా గౌరవం ఉంది. కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే విలువైన సూచనలు ఇస్తూ ఉంటారు. విలువలతో బతకాలని, మంచి పనులు చేయాలని చెబుతుంటారు. ఆయనలాంటి వారు కుటుంబంలో ఉండటం అదృష్టం. దేవుడిపై నమ్మకం ఉంచాలనీ.. అదే సమయంలో మనమూ విశ్లేషించుకోవాలని చెప్పేవారు’ అంటూ రిషి గుర్తుచేసుకున్నారు.

  అక్షతామూర్తికి రూ.126.61 కోట్లు ఆదాయం

  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతామూర్తి 2022లో ఇన్ఫోసిస్ డివిడెండు నుంచి రూ.126.61 కోట్లను ఆర్జించారు. సెప్టెంబరు చివరి నాటికి అక్షతకు కంపెనీలో 3.81కోట్ల షేర్లున్నాయి. వీటి విలువ రూ.126.61 కోట్లు. బీఎస్‌ఈలో ఆమె వాటా విలువ సుమారు రూ.5,956 కోట్లు. అయితే విదేశాల్లో ఆర్జించే ఆదాయంపై 15ఏళ్ల వరకు బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై ఇటీవల అక్కడ రచ్చ జరిగింది. దీంతో తాను ఈ ఆదాయాన్ని తీసుకోబోనంటూ అక్షతామూర్తి ప్రకటించింది.

  బ్రిటన్‌ రాణి కన్నా అక్షత ఆదాయమే ఎక్కువ!

  42 ఏళ్ల అతిచిన్న వయసులో 210 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని ప్రధాని పదవిని అధిరోహించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌. అతడి సతీమణి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల గారాల పట్టి అక్షత. కర్ణాటక హుబ్బళ్లిలో పుట్టి పెరిగిన అక్షతను ‘నమ్మ హుడుగి’ అంటూ కన్నడిగులు పిలుచుకుంటారు. అయితే ఈమెకు ఇన్ఫోసిస్‌లో వాటాలతో పాటు అనేక సంస్థల్లో పెట్టుబడులతో కలిపి భారీగానే ఆదాయం వస్తోంది. అంతా కలిపి బ్రిటన్‌రాణి క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఆస్తుల విలువ కన్నా అక్షత ఆదాయం ఎక్కువ … Read more

  గణనీయ వృద్ధి సాధించిన Infosys

  గతేడాదితో పోలిస్తే ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లాభం, ఆదాయంలో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబరు త్రైమాసికానికి లాభంలో 11శాతం, ఆదాయంలో 23శాతం గ్రోత్‌ని సాధించింది. అంచనాలకు మించి రాణించడంతో రూ.9,300కోట్ల షేర్లను బైబ్యాక్ చేస్తామని ప్రకటించింది. వాటాదార్లకు మధ్యంతర డివిడెండుగా రూ.16.50 చెల్లించేందుకు సిద్ధమైంది. జులై- సెప్టెంబరు త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఏకీకృత లాభం రూ.6,021 కోట్లుగా నమోదైంది. అలాగే 2022-23 ఆదాయ వృద్ధి అంచనాలను 14-16 నుంచి 15-16గా సవరించింది.

  ‘త్వరలో వైజాగ్‌కు ‘ఇన్ఫోసిస్’’

  వచ్చే ఏడాది జనవరి నాటికి విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ రాకతో వైజాగ్ ఐటీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  HCL‌లో 40 వేల ఉద్యోగాలు

  ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ HCL త్వరలో 40 వేల మంది ప్రెషర్లను నియమించుకోనుందని సీఈవో సి.విజయ కుమార్ తెలిపారు. అలాగే రానున్న 3 నుంచి 5 ఏళ్లలో నియర్‌షోర్ ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. 2022-23 ఏడాదిలో టెలికాం, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవల్లో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎలాంటి ప్రభావం మా సంస్థపై పడలేదని సీఈవో వివరించారు.