సత్తా చాటిన INS సత్ఫూరా
ఆస్ట్రేలియాలో జరిగిన ‘కాకాడు-2022’ యుద్ధ విన్యాసాల్లో భారత యుద్ధ నౌక INS సత్ఫూర సత్తా చాటింది. యాంటీ సబ్మెరైన్, యాంటీ షిప్ యుద్ధ విన్యాసాల్లో అబ్బురపరిచింది. గన్ ఫైరింగ్ విన్యాసాల్లో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. డార్విన్ తీరంలో జరిగిన ఈ విన్యాసాల్లో మొత్తం 14 దేశాలు పాల్గొన్నాయి. సముద్ర జలాల్లో మిత్రదేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా వీటిని నిర్వహించారు.