మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నాయా?
ఖాతాదారుల అనుమతి లేకుండా బ్యాంకుల నుంచి డబ్బులు డెబిట్ అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. పలు స్కీములకు వీటిని వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఖాతాదారులు గోడు వెల్లబోసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల్లో ఖాతాదారులను ఎన్రోల్ చేసి డబ్బులను డెబిట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, బీమా పరిహారం పొందడానికి కూడా వీలులేకుండా ఉంటోందని కొంతమంది సోషల్ మీడియాల్లో ఆరోపిస్తున్నారు. ఉన్నట్టుండి ఖాతా నుంచి డబ్బులు కట్ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఎస్బీఐ, కెనరా బ్యాంకు తదితర వాటిల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని వాపోతున్నారు.