వచ్చే ఏడాది నుంచి ఇంటర్ సిలబస్ మార్పు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మారనుంది. ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలుగు, ఇంగ్లిష్ సిలబస్ మార్చిన బోర్డు.. త్వరలో మిగతా సబ్జెక్టుల్లోనూ కొత్త మార్పులు తీసుకురానుంది. ఏయే అంశాలు మార్చాలో సబ్జెక్టులవారిగా నిపుణుల కమటీని వేయనుంది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ పరీక్షలు వందశాతం సిలబస్‌తో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.