IPL ఏడాదికి రెండు సార్లు నిర్వహణ: రవిశాస్త్రి
ఇక నుంచి ఐపీఎల్ ఏడాదికి రెండు సీజన్లుగా ఉండవచ్చని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి అర్ధభాగంలో IPL చిన్న ఫార్మాట్ ఉండవచ్చని పేర్కొన్నారు. 10 నుంచి 12 జట్లతో షెడ్యూల్ ఒకటిన్నర నుంచి రెండు నెలల వరకు ఉంటుందన్నారు. గత కరోనా సమయం నుంచి బ్రాడ్కాస్టింగ్, స్పాన్సర్షిప్ ఒప్పందాల నుంచి భారీ మొత్తాన్ని కోల్పోయే స్థితిలో బోర్డు లేదన్నారు. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకునేందుకు ఐపీఎల్ రెండు సీజన్లుగా నిర్వహిస్తారని అంచనా వేశారు.