• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 24/7 అదే ఆలోచన ఉందన్న ఎలాన్ మస్క్

  ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ కొనుగోలు గురించి తాను 5 శాతం కంటే తక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదేమి రాకెట్ సైన్స్ కాదని చమత్కరించాడు. నిన్న గిగా టెక్సాస్, నేడు స్టార్‌బేస్, టెస్లా నా మనస్సులో 24/7 ఉంటుందని చెప్పాడు. అందుకు అమ్మాయితో వెళుతున్న ఓ వ్యక్తి మరో అమ్మయిని వెనక్కి తెరిగి చూసే ఫన్నీ మీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ప్రకటించాడు. మరోవైపు ఈ బిలియనీర్ ఏప్రిల్ ప్రారంభంలో ట్విట్టర్‌లో తన … Read more

  20-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

  – పోలీస్ ఉద్యోగార్థులకు రెండేళ్ల వయోపరిమితి పెంచడంతో పాటుగా దరఖాస్తు చివరి తేదీని కూడా పొడగించిన ప్రభుత్వం. ఈ నెల 26 వరకు చాన్స్ – OLA, UBER కంపెనీలపై ఫైర్ అయిన వినియోగదారుల ఫోరమ్ – తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసిన ఎలాన్ మస్క్ – ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – ఈ రెండేళ్లలో విమానాల్లో 15.75 కోట్ల మంది ప్రయాణించారని తెలిపిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా – జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన … Read more

  సంచలన నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్

  44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్ కు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం స్పామ్ అకౌంట్ల గురించి రగడ నడుస్తోంది. ఈ స్పామ్ అకౌంట్లు 20 శాతం వరకు ఉంటాయని మస్క్ అంటుండగా.. ట్విట్టర్ మాత్రం కేవలం 5శాతం మాత్రమే ఉంటాయని అంటోంది. ఈ అకౌంట్ల లొల్లి ముగిసే వరకు ట్విట్టర్ డీల్‌ను పక్కన పెడుతున్నట్లు మస్క్ ప్రకటించారు. ఇప్పుడు ధరను కూడా తక్కువ చేయాలనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది.

  ట్విట్టర్ డీల్ రద్దు చేసుకుంటున్న మస్క్..?

  ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుంచి నిత్యం వార్తలో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ట్విట్టర్‌లో ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తామని ఏప్రిల్ 14న ఒప్పందం చేసుకున్నారు. కాని ప్రస్తుతం షేర్ విలువను తగ్గించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. వీలైతే మొత్తం డీల్‌ని కూడ రద్దు చేసుకునే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. అలాగే ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు 5 శాతం మాత్రమే ఉన్నాయని సీఈవో పరాగ్ అగర్వాల్ పేర్కొనగా వాటి సంఖ్య … Read more

  బైడెన్.. అంత డ్రామా అక్క‌ర్లేదు: ఎలాన్ మ‌స్క్

  ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ్క్ అమెరికా అధ్య‌క్షుడి గురించి చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. జో బైడెన్ అమెరికాను ఏదో ఉద్ద‌రించ‌డానికి ఎన్నికైన‌ట్లు భావిస్తున్నారు. కానీ అంత డ్రామా అక్క‌ర్లేదు అని ట్వీట్ చేశాడు. మ‌రోవైపు 2024 ఎన్నిక‌ల్లో త‌క్కువ‌ విభ‌జ‌న స్వ‌భావం ఉన్న వ్య‌క్తి ప్రెసిడెంట్‌గా ఉండ‌టం మంచిది. కానీ ఇప్ప‌టికీ ట్రంప్‌ ట్విట్ట‌ర్ ఖాతాను పున‌రుద్ధ‌రించ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ట్వీట్ చేశాడు.

  ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేస్తాన‌న్న ఎలాన్ మ‌స్క్‌

  అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్ట‌ర్ నిషేధాన్ని ఎత్తివేస్తాన‌ని ఎలాన్ మ‌స్క్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల 44 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మ‌స్క్, ట్రంప్ త‌న‌ అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకోకుండా నిషేధించడం నైతికంగా త‌ప్పు అని పేర్కొన్నాడు. మొద‌టినుంచి ఈ విధానానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతూ వ‌స్తున్న మ‌స్క్ ఈ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్‌లో జరిగిన అల్లర్ల నేప‌థ్యంలో ట్రంప్ హింస‌ను ప్రేరేపిస్తున్నారంటూ ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాను శాశ్వ‌తంగా నిషేధించారు.

  త‌న‌ తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శ‌న‌ను గుర్తు చేసుకున్న ఎలాన్ మ‌స్క్

  టెస్లా, ట్విట్ట‌ర్ సీఈఓ ఎలాన్ మ‌స్క్ 2007లో తాను తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శించిన విష‌యాన్ని గుర్తుచేసుకున్నాడు. ట్విట్ట‌ర్‌లో ఆగ్రా రెడ్ ఫోర్ట్ గురించి ట్వీట్ చూసి స్పందించిన ఆయ‌న నేను 2007లో ఆగ్రాకు వ‌చ్చాను. తాజ్‌మ‌హ‌ల్‌ను కూడా సంద‌ర్శించాను. అది నిజంగా ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన వింత అంటూ భారతీయ వాస్తుశిల్పం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. వెంట‌నే మ‌స్క్ త‌ల్లి మాయే మ‌స్క్ కూడా 1954లో మ‌స్క్ తాత‌లు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్ఙంచిన విష‌యాన్ని గుర్తుచేశారు.రేడియో లేదా GPS లేకుండా సింగిల్-ఇంజిన్ ప్రొపెల్లర్ ప్లేన్‌లో ఈ … Read more

  అలా అయితే జపాన్‌కు చాలా కష్టమవుతుందన్న మస్క్

  జనాభా తగ్గుదల జపాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఆంశంపై ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. 2021లో జపాన్ జనాభా భారీగా పడిపోయిందని అక్కడి స్థానిక మీడియా చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ మస్క్ ట్వీట్ చేశారు. మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉండేలా ఏవైనా మార్పులు చేయకపోతే చివరకు జపాన్ తన ఉనికిని కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ దేశంలో 2008 నుంచి జనాభా తగ్గుకుంటూ వస్తోంది. ప్రస్తుతం జపాన్ దేశంలో 12.5 కోట్ల … Read more

  ట్విట్ట‌ర్ వినియోగం కోసం రుసుము

  ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి కంపెనీ పాల‌సీల్లో మార్పుల‌కు శ్రీకారం చుట్టాడు. తాజాగా సాధారణ వినియోగదారులకు Twitter ఎల్లప్పుడూ ఉచితం, కానీ వాణిజ్య/ప్రభుత్వ వినియోగదారులకు కొంచెం ఖర్చు కావచ్చు అని ట్వీట్ చేశాడు. ట్విట్ట‌ర్‌లో కొత్త ఫీచర్‌లతో ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచాలని, నమ్మకాన్ని పెంచడానికి, స్పామ్ నియంత్రించ‌డానికి, అంద‌రీకి ప్రామాణీక‌ర‌ణ అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెప్పాడు.

  ట్విట్టర్ ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందంటే

  ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్య్రం నినాదంతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. ఆ యాప్‌లో సమూల మార్పులకు కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన పూర్తి స్థాయి పగ్గాలు చేపట్టిన తరువాత ఎడిట్ బటన్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందో అనే ఒక డెమో వీడియోను సంస్థ రివర్స్ ఇంజనీర్ జేన్ మంచును వాంగ్ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ … Read more