మరణం ముంగిట మరో 100 మంది
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆ దేశ మహిళలు చేపట్టిన నిరసనలు 100వ రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులను అణచి వేసేందుకు అక్కడి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 11 మంది నిరసనకారులను ఉరి తీశారు. ఆందోళనల్లో భాగంగా అదుపులోకి తీసుకున్న మరో 100 మందికి ఉరి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాగా పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 476 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మందిని అరెస్ట్ చేశారు.