భారత్-అమెరికా బంధంపై జైశంకర్ ప్రశంసలు
USISP ఫోరం నిర్వహించిన వ్యాపారుల విందులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్-అమెరికా మధ్య ఉన్న పారిశ్రామిక బంధంపై మాట్లాడారు. భారత్-అమెరికా బంధంపై సంతోషం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పుడిప్పుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఇండియాలో ఇంజిన్, హెల్త్, వాతావరణం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, రక్షణ డొమైన్స్లో గణనాత్మకమైన మార్పులు వస్తాయన్నారు.