పవర్ రేంజర్స్ నటుడు ఆత్మహత్య
పవర్ రేంజర్స్ సిరీస్ నటుడు జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఆత్మహత్య చేసుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జాసన్.. అమెరికాలోని టెక్సాస్‌లో మృతి చెందారు. కాగా, టమీ ఓలివర్ పాత్ర పోషించి జాసన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 14 ఎపిసోడ్లలో కనిపించిన జాసన్.. ఆ తర్వాత అతని పాపులారిటీ కారణంగా వైట్ రేంజర్, కమాండర్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. జాసన్ మృతిపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందా అని ఆలోచిస్తున్నారు.