ఫిఫా స్ట్రీమింగ్ సమస్య పరిష్కరిస్తాం: జియో సినిమా
ఫిఫా ప్రపంచకప్ లైవ్ స్ట్రీమింగ్ అంతరాయం పట్ల వినియోగదారుల ఫిర్యాదులపై జియో సినిమా స్పందించింది. తమ సిబ్బంది బఫరింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన సంస్థ…త్వరలోనే ఇబ్బందులు తొలగిస్తామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు యంత్రాలతో కుస్తీ పడుతూ పనిచేస్తున్నట్లుగా ఉంది.