JIO: 4జీ ధరలకే.. 5జీ ప్లాన్స్
రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. 5G ప్లాన్స్‌ను 4G రేట్లకే అందిస్తామని ప్రకటించింది. 4G రేట్ల కంటే ఎక్కువ వసూలు చేయమని వెల్లడించింది. 5G సేవల విలువను గుర్తించే వరకు కొత్త ధరలను అమలు చేసే ఆలోచన లేదని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే.. జియో 5G సేవలు ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో దీపావళి కల్లా అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవల వెల్లడించింది.