కరోనా కథ ముగిసినట్లే!
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్త కేసులు 1,000 దిగువకు చేరడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. క్రియాశీలక కేసులు 22 వేలకు తగ్గిపోయాయి. సోమవారం కొత్తగా నమోదైన కేసులు 862 మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 22,549 కేసులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కరోనాతో 5,28,980 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 219.56 కోట్ల టీకాలు వేసినట్లు పేర్కొంది.