• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRSకు 100 సీట్లు గ్యారంటీ: కవిత

    TS: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని ఆశించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్లలో తమ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు.

    కిషన్‌రెడ్డికి కవిత కౌంటర్

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాష్ట్రంలో కరెంట్‌పై బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కిషన్‌ రెడ్డి కట్టు కథలు చెప్పడం మానుకోండి. కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయి,’ అని కవిత పేర్కొన్నారు.

    వారికి రాహుల్‌‌ను విమర్శించే స్థాయి లేదు: ఉత్తమ్

    సీఎం కేటీఆర్ పై కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యారు. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌, కవితలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. రాహుల్‌ విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని కొనియాడారు, తెలంగాణను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని పేర్కొన్నారు, తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

    రేవంత్‌ రెడ్డిపై కవిత ఫైర్

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి శవాల మీద పేలాలు ఏరుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ”రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తెలిపారు.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    లండన్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్ పర్యటనకు వెళ్లారు. ఆమె శుక్రవారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ‘మహిళా రిజర్వేషన్ చట్టం- ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అటుమ్ని సమావేశంలో కవిత పాల్గొంటారు.

    కవిత, సంజయ్‌ల ఆత్మీయ పలకరింపు

    తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ బీజేపీ నేత గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురై కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్‌రావును సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్, కవిత ఎదురుపడిన వేళ.. | MLC Kavitha | Bandi Sanjay … Read more

    కవితపై తప్పుగా మాట్లాడ లేదు: బండి

    టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.BRS ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తనెవరినీ కించపరచలేదని వెల్లడించారు. తెలంగాణలో వాడుకలో ఉన్న సామెతను మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కాగా పేపర్ లీకేజీ కేసులో నిందుతురాలు రేణుక కుటుంబ సభ్యులు BRS నేతలేనని బండి సంజయ్‌ ఆరోపించారు. పేపర్‌ లీక్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    కవిత అభ్యర్థన తిరస్కరించిన సుప్రీంకోర్టు

    ఈడీ విచారణకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై 24న విచారణ జరగాల్సి ఉన్నా… వాయిదా పడే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం బిజీ షెడ్యూల్ కారణంగా మారుతుందని తెలుస్తోంది. మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే తాజాగా జాబితాలో విచారణ మార్చి 27న … Read more