‘వయసు మీరితే ఛాన్సులు తక్కువ’
యువ నటీమణులకే చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఎక్కువగా వస్తాయని హీరోయిన్ రాధిక ఆప్టే వెల్లడించింది. ‘హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలు మీలో లేవు’ అనే మాట హీరోయిన్లకు తరచూ వినిపిస్తుంటుందని తెలిపింది. మేకర్లకు యుక్త వయసులో ఉన్న హీరోయిన్లే కావాలని చెప్పింది. వయసు మీరితే సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని ఈ భామ పేర్కొంది. లెజెండ్ సినిమాతో హీరోయిన్ ‘రాధిక ఆప్టే’ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైంది. బాలకృష్ణ సినిమా లయన్ తర్వాత తెలుగులో మళ్లీ నటించలేదు. హిందీలోనే వరుసగా సినిమాలు చేస్తోంది.