టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం
వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై ఇక వాహన పరిమాణం, ప్రయాణించిన దూరం, ప్రయాణించిన సమయాన్ని ఆధారంగా చేసుకుని టోల్ ఫీజును వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు తక్కువ దూరమే ప్రయాణించాల్సి వచ్చినా.. పూర్తి టోల్ ఫీజును ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని కేంద్రం చూస్తోంది.