• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింహంతో డిన్నర్ చేసిన యువతి: ఒకే ప్లేట్‌లో..

    ఓ యువతి ఏకంగా సింహంతో కలసి భోజనం చేసింది. అది కూడా ఒకే ప్లేట్‌లో ఫుడ్ షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ యువతి పెద్ద సింహంతో కలసి ఒకే ప్లేటులో చికెన్ తింటూ కనిపించింది. ఏ మాత్రం భయం లేకుండా ఓ ఫ్రెండ్ మాదిరి దాని పక్కనే కూర్చుని ఫుడ్ ఆరగించింది. ఈ ఘటన యూఏఈలోని ఓ వైల్డ్ లైఫ్ పార్కులో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. https://www.instagram.com/reel/CuRbbtegHdh/?utm_source=ig_web_copy_link

    ఆవు కోసం సింహానికే ఎదురెళ్లాడు

    తన ఆవును రక్షించుకోవడానికి ఓ రైతు సింహానికే ఎదురెళ్లాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ రైతు తన ఆవును మేపుతుండగా సింహం వచ్చి దాడి చేసింది. ఆవు గొంతును సింహం పట్టుకుని కొరుకుతుండగా విలవిల్లాడిపోయింది. దీంతో రైతు ఆవును ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దగా అరుస్తూ సింహానికి ఎదురెళ్లాడు. రాయి తీసుకుని సింహంపై విసరగా అది పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય … Read more

    పాపం… మృగరాజు

    సాధారణంగా వేటాడే సింహాలను చూసి భయపడతాం. కానీ, ఈ సింహం చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంది. వాటికున్న శరీరాకృతి కారణంగా చెట్లు ఎక్కడంలో అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. అడవికి రారాజుగా పిలుచుకునే సింహం చెట్టు నుంచి కిందపడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. https://www.instagram.com/p/CnK0XGDBpih/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:Waow Africa Screengrab Instagram:Waow Africa

    బోనులో ఉంది కదా అని చెయ్యి పెడితే వేలు పోయే!

    క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. జూలో ఉన్న జంతువులను దూరం నుంచి చూసి అలా ఫొటో దిగితే తప్పు లేదు. కానీ, ఏమవుతుందిలే అని అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు. ఓ వ్యక్తి సింహం బోనులో చేతి పెట్టి జూలను ముట్టుకోవటానికి ప్రయత్నించాడు. ఇంతలో అది వేలును నోటితో పట్టుకుంది. ఎంతగా ప్రయత్నించినా విడువలేదు. వేలును లాగేసింది. కొద్దిరోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Earth Reels … Read more

    సింహంతో పరాచకాలు; జులాయికి ముచ్చెమటలు

    ఓ వ్యక్తి సింహాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నించి చావు దెబ్బ తిన్నాడు. జూలో రెండు సింహాలు ఉండగా ఓ వ్యక్తి వాటిని మచ్చిక చేసుకునేందుకు సింహంపై చేయి పెడతాడు. దీంతో ఆగ్రహంతో అతడి చేతిని తన నోటిలోకి లాక్కుంటుంది. చేతిని సింహం గట్టిగా కొరకడంతో బాధతో విలవిల్లాడాడు. అతడికి సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కానీ సింహమే అతడిని వదిలేయడంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. https://twitter.com/ViciousVideos/status/1607347367824474112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607347367824474112%7Ctwgr%5E7c6d15689d99dc1c7377b32bf1fe1218b242f237%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fhorrifying-video-man-tries-pet-caged-lion-see-what-happens-next-1514315

    సింహంతో వ్యక్తి ముద్దులు.. వీడియో వైరల్

    [VIDEO:](url) సింహాన్ని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఓ వ్యక్తి మాత్రం సింహంతో క్లోజ్ ఫ్రెండ్‌లా వ్యవహరిస్తున్నాడు. తన చేతిల్లోకి సింహం తలను తీసుకుని ముద్దాడుతున్నాడు. దీనికి ఆ సింహం కూడా సహకరిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడు ఇతడే’ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరేమో ఇది అసలైన వీడియో కాదని చెబుతున్నారు. సింహం క్రూర … Read more