దిగ్గజాల సరసన గబ్బర్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ కెప్టెన్ శిఖర్ ధవన్ అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ధవన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ధవన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు లిస్ట్ ఏ క్రికెట్లో 12 వేల పరుగులు చేసిన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం గబ్బర్ 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. ధవన్ కంటే ముందు సచిన్ (21,999), గంగూలీ (15,622), ద్రావిడ్ (15,271), కోహ్లీ (13,786), ధోనీ (13,353), యువరాజ్ సింగ్ (12,633) ఉన్నారు.