ఆపరేష్ బొగ్గు డాక్యుమెంట్ విడుదల
మునుగోడు ఉపఎన్నిక వేళ ఆపరేషన్ బొగ్గు పేరుతో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఓ డాక్యుమెంట్ విడుదల చేశారు. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ వచ్చిందని చెప్పారు. దీని విలువ రూ.18వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ అని ఎద్దేవా చేశారు.