మారుతి సుజుకీ ఎస్స్ ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్
మారుతి సుజుకీ నుంచి మరో మోడల్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఎస్ ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్ను లాంఛ్ చేయనున్నారు. ఈ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త యాక్ససరీస్ రానున్నాయి. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, గ్రిల్స్పై క్రోమ్ గార్నిష్ ఎఫెక్ట్, వీలా ఆర్చీస్పై బ్లాక్ క్లాడింగ్ వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని డీలర్ వద్దే ఫిట్ చేసి అమ్ముతారని తెలుస్తోంది. మెకానిక్స్ పరంగా పెద్దగా మార్పులు లేవు. ఇవి రెగ్యులర్ ఎస్ ప్రెస్సో మాదిరిగానే ఉంటాయి. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.