బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ కీలక భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ కీలక పథకాలను ఆయా రాష్ట్రాల్లో మెరుగ్గా అమలుపరచాలని సూచించారు. దీంతో పాటు పలు కీలక పథకాల అమలుతీరు, వాటి ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రులకు వివరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 12 మంది ముఖ్యమంత్రులు, 8 మంది ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.