• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • త‌న ఫ‌స్ట్‌ల‌వ్‌ను గుర్తుచేసుకున్న మెగాస్టార్

  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, అమీర్‌ఖాన్, నాగ‌చైత‌న్య‌ల‌ను కింగ్ నాగార్జున ఇంట‌ర్వ్యూ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ప‌దేళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మీ ఫ‌స్ట్ ల‌వ్ ఎప్పుడు అని నాగ్ చిరంజీవిని అడిగాడు. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు నాకు సైకిల్ అంత‌గా రాదు. ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. ఆమె నేర్పిస్తుంటే సైకిల్ చూడ‌కుండా నేను ఆ అమ్మాయినే చూసేవాడిని అంటూ త‌న ఫ‌స్ట్‌ల‌వ్ గురించి … Read more

  చిరంజీవి బర్త్ డే వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు

  మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసేందుకు మెగా అభిమానులు సిద్ధమయ్యాయి. చిరు పుట్టిన రోజు ఆగస్టు 22 కాగా అంతకు ముందే ఆయన జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్‌చరణ్ యువసేన అధ్వర్యంలో విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభిమానుల మధ్య చిరంజీవి జన్మదిన వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

  ఈ సినిమాలు ఆ విష‌యాన్ని మళ్లీ నిరూపించాయి: చిరంజీవి

  ఆగ‌స్ట్ 5న విడుద‌లైన సీతా రామం, బింబిసార చిత్రాలకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రెండు చిత్ర‌బృందాల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. ప్రేక్ష‌కులు థియేర్ల‌కు రావ‌డంలేద‌ని బాధ‌ప‌డుతున్న ఇండ‌స్ట్రీకి ఈ రెండు సినిమాలు ఎంతో ఊర‌ట‌నిచ్చాయి. కంటెంట్ బాగుంటే త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మ‌రోసారి ఇవి నిరూపించాయి. ఈ రెండు చిత్రాలు విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ఆయ‌న‌ సంతోషం వ్యక్తం చేశారు.

  మెగాస్టార్,అమీర్‌ఖాన్‌తో నాగార్జున కింగ్‌సైజ్‌ ఇంట‌ర్వ్యూ

  అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నాడు. నాగ‌చైత‌న్య ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున అమీర్‌ఖాన్‌, చిరంజీవి, నాగ‌చైత‌న్య‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. సినిమా విశేషాల‌తో పాటు ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించుకుంటూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి ఇంట‌ర్వ్యూ విడుద‌ల కానుంది.

  భోళా శంక‌ర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించిన నిర్మాత‌

  మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ ‘భోళా శంక‌ర్’ నిర్మాత అనీల్ సుంక‌ర్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇది ప్ర‌ధానంగా సిస్ట‌ర్ సెంటిమెంట్ క‌థాంశంతో కూడుకున్న‌ప్ప‌టికీ, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయ‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది భోళా శంక‌ర్ రిలీజ్ అవుతుంది. సినిమా స‌క్సెస్ గురించి చాలా న‌మ్మ‌కంగా ఉన్న‌మ‌ని తెలిపారు. త‌మిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేశ్ న‌టిస్తుంన్న విష‌యం … Read more

  ‘భోళాశంక‌ర్‌’లో కీర్తిసురేశ్ బాయ్‌ఫ్రెండ్ అత‌డేన‌ట‌!

  మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంక‌ర్’ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది చిరు 155వ సినిమా. త‌మిళ మూవీ వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తుంది. త‌మిళంలో సోద‌రి పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేదు. కానీ తెలుగులో ఆ పాత్ర ప‌రిధి పెంచిన‌ట్లు తెలుస్తుంది. దీంతో కీర్తిసురేశ్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించేందుకు ఒక యంగ్ హీరోను సంప్ర‌దించార‌ట‌. దానికి అత‌డు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. ఆ హీరో ఎవ‌రో త్వ‌ర‌లో రివీల్ చేస్తామ‌ని చిత్రబృందం … Read more

  మా ఇంటి కోడ‌లు పిల్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు: చిరంజీవి

  రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న బ‌ర్త్‌డే వేడుకలు నిన్న ఘ‌నంగా జ‌రిగాయి. మా ఇంటి కోడ‌లు పిల్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని చెప్తూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ కూడా త‌న భార్య‌కు సోష‌ల్‌మీడియా ద్వారా విషెస్ తెలిపాడు. ఉపాస‌న బ‌ర్త్‌డే వేడుకల‌ను నిన్న మెగా ఫ్యాన్స్‌, రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల్లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

  చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్

  సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఇటీవ‌ల చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవి ఇండ‌స్ట్రీకి చేసిందేమి లేద‌ని అన్నాడు. కార్మికుల కోసం హాస్ప‌టల్ క‌ట్టించ‌డం అవ‌స‌రమా ముందు వాళ్లకు పని ఇప్పించండి ఎంత‌మంది ప‌నిలేక ఖాళీగా తిరుగుతున్నారు. హాస్పిట‌ల్ ఎంత‌మందికి అని క‌ట్టించ‌గ‌ల‌డు. నేను క‌ట్టించాను అని గొప్ప‌లు చెప్పుకోవ‌డానికా అన్నాడు. దీనిపై తాజాగా ముర‌ళీమోహ‌న్ స్పందించాడు. ఇంత‌కీ కోట శ్రీనివాస‌రావు ప‌రిశ్ర‌మ‌కు చేసిన మేలేంటో చెప్పాల‌ని అన్నాడు. చిరంజీవి చాలామందికి చాలార‌కాలుగా సాయ‌ప‌డ్డాడు. ఈరోజుకు ఏదో ఒక విదంగా సాయం చేస్తూనే ఉంటాడు. … Read more

  చిరిగిన చొక్కాతోనే చిరు పెళ్లి..కారణమిదే!

  మెగాస్టార్ చిరంజీవి పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చిరును మొదట చూసి అల్లు రామలింగయ్య యాక్టింగ్ బాగుందని ఫ్యూచర్లో మంచి నటుడు అవుతాడని అరవింద్ తో చెప్పాడటా. ఆ తర్వాత పెళ్లి విషయం చిరుతో అరవింద్ ప్రస్తావించారు. చిరు మొదట ఒప్పుకోగా, సురేఖ మాత్రం చిరు స్టైల్ గా లేడని చెప్పిందని తెలిసింది. తర్వాత అల్లు రామలింగయ్య ఒప్పించాడటా. 1980 ఫిబ్రవరి 20న వీరి పెళ్లి సమయంలో చిరంజీవి ఓ మూవీ షూటింగ్లో చిరిగిన చొక్కాతో పాల్గొన్నారు. మళ్లీ అదే … Read more

  వ‌రుస‌గా బ‌డా ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టిన మారుతి

  డైరెక్ట‌ర్ మారుతీకి ప్ర‌భాస్‌తో సినిమా ఓకే అయిన‌ట్లు తెలుస్తుంది. ఈ ద‌స‌రాకే దాని అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుంద‌ట‌. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఈవెంట్‌లో మారుతీతో మూవీకి మెగాస్టార్ ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే మెగా ఫ్యాన్స్‌, డార్లింగ్ ఫ్యాన్స్ ఈ విష‌యంపై సోష‌ల్‌మీడియాలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌రుస పాన్ ఇండియా సినిమాల మ‌ధ్య మారుతీతో సినిమా మంచి నిర్ణ‌యం కాదు అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు మారుతీ సినిమాల‌న్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్న … Read more