• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు

    కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు దుండగులు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్‌కు ఎలాంటి పేమెంట్ లింక్‌ రాకుండా సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    మంత్రి ఇంటిపై బాంబు దాడి

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్‌లో ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట బాంబు పేలింది. శనివారం రాత్రి 10 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంత్రి ఇంటిపై గ్రెనెేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న CRPF జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. పేలుడు గురించి తెలుసుకున్న సీఎం బీరెన్ సింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి భద్రత పెంచాలని ఆదేశించారు.

    మంత్రి హరీశ్‌కు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    మంత్రి హరీశ్ రావుకు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్పడానికి హరీశ్ ఎవరు? నేను మల్కాజ్‌గిరి.. నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. హరీశ్ కీప్‌నకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంట్లో రెండు టికెట్లు ఎందుకివ్వరు. సిద్దిపేటలో హరీశ్‌ను ఓడిస్తా.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Talks in political circles—that BRS Malkajgiri MLA … Read more

    మంత్రి విడదల రజినీకి తీవ్ర అస్వస్థత!

    ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆస్పత్రి ప్రారంభోత్సవం చేస్తుండగా రజినీ అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపైనే అధికారులు ఆమెకు ఓఆర్ఎస్ ఇచ్చారు. సభలో మాట్లాడేందుకు ప్రయత్నించినా మంత్రి వల్ల కాలేదు. దీంతో ఆమె జగ్గయ్యపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడంతో రజినీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా రజనీకి అస్వస్థత #ysrcp #ycp #vidadalarajini #rajini #andhrapradesh #jaggayyapeta pic.twitter.com/KsecbeIeog — … Read more