ఇబ్బంది పడ్డ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి బొత్స
ఏపీ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదుకాకున్నా ఇబ్బంది లేదని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. పలు చోట్ల ఇంటర్ నెట్ లోపం, కరెంట్ సమస్యలు తలెత్తినట్లు గుర్తు చేశారు. సమన్వయ లోపం వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆలస్యమైన వారికి మెమోలు కూడా జారీ చేయాలేదన్నారు. మంత్రి ఈ అంశంపై గురువారం ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీచర్ల అభ్యంతరాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు.