• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేంద్రం తీరుపై మళ్లీ మండిపడ్డ కేటీఆర్

  కేంద్రం తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఏం తినాలో, ఏం వినాలో కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు పెరిగి దేశంలో దారుణ పరిస్థితి నెలకొందన్నారు. సమస్యల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ మెటీరియల్ పంపిణీ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలే లక్ష్యం ఏర్పడ్డ తెలంగాణను 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

  రేపిస్టులు మరణించే వరకు జైల్లోనే ఉండాలి: కేటీఆర్

  జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారన్న దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులు అరెస్టైన 45 రోజుల తర్వాత తెలంగాణ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. జువెనైల్ యాక్ట్, IPC & CrPCలో లొసుగుల కారణంగా రేపిస్టులు బెయిల్‌పై వచ్చారన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో 11 మంది రేపిస్టుల విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ … Read more

  బండి సంజయ్ ని నిలదీసిన మంత్రి కేటీఆర్

  తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు. కరీనంగర్ ఎంపీగా ఉన్న సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్క మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ కూడా మంజూరు చేయలేన్నారు. గత 8 ఏళ్లలో తెలంగాణలో చేనేత కార్మికుల కోసం మీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఎంపీగా ఉన్నారా లేదా ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు.

  NDRF నిధుల్లో తెలంగాణకు సున్నా..ప్రశ్నించిన KTR

  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా NDRF ఫండ్స్ ఫొటోలు జతచేశారు. వాటిలో 2018 నుంచి ఇప్పటివరకు NDRF నిధుల్లో కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఫండ్స్ ను ఇచ్చినట్లు మ్యాపులో పేర్కొన్నారు. 2020 హైదరాబాద్ వరదల నుంచి 2022 గోదావరి వరదల వరకు రాష్ట్రానికి సాయం అందించలేదన్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష అంటూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ ఇదేనా అని KTR … Read more

  రాష్ట్రంలో పక్కా హ్యాట్రిక్ విజయం సాధిస్తాం: KTR

  TRS పార్టీనే తెలంగాణ మొత్తం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశం బీజేపీ, కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇష్టాగోష్టిలో KTR ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లోనే ఎలక్షన్స్ ఉంటాయని కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 90కిపైగా సీట్లు గెలుస్తామని తమ సర్వేలో స్పష్టమైనట్లు తెలిపారు. అమేథీ, కొడంగల్ లో గెలవనివారు సిరిసిల్లలో ఎలా గెలుస్తారంటూ ఎద్దేవా చేశారు.

  కేటీఆర్ వ్యాఖ్యలు.. TRS నుంచి ఎమ్మెల్యేలు జంప్?

  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని మంత్రి కేటీఆర్ ఖమ్మం సభలో అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉండదని కేటీఆర్ బాంబ్ పేల్చాడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీకే సర్వేలో మంచి ఫలితాలు వచ్చినవారికే సీట్లు ఇస్తానని KTR చెప్పాడని సమాచారం. దీంతో ఈసారి తమకు ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారో లేదోనని పలువురు ఎమ్మెల్యేలు గబారా పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి గత ఎన్నికల్లో 14 … Read more

  తెలంగాణలో రూ.24000 కోట్ల పెట్టుబడులు

  తెలంగాణలో రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. ఫార్చూన్ 500 కంపెనీ ఎలెస్ట్ రాష్ట్రంలో రూ.24000 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద అమొలెడ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ తయారీ పరిశ్రమను దుండిగల్‌ పారిశ్రామిక పార్కులో ఎలెస్ట్ నెలకొల్పనుంది. దీంతో సుమారు 5వేల మందికి ఉపాధి వచ్చే అవకాశముంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో బెంగళూరులో అవగాహన ఒప్పందం కుదిరింది.

  ‘డిజిటల్ తెలంగాణ’ దిశగా మరో ముందడుగు

  అత్యాధునిక సాంకేతికతలతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ..డిజిటల్ దిశగా మరో ముందడుగు వేసింది. ప్రపంచస్థాయి పౌరసేవలు అందించేలా మాస్టర్‌కార్డ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది. డిజిటల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం తదితర రంగాల్లో మాస్టర్‌కార్డ్‌ ప్రభుత్వానికి సహకరించనుంది. చిన్న,మధ్యతరహా వ్యాపారాలు రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు డిజిటల్ తెలంగాణ విజన్‌లో భాగస్వాములవడం సంతోషంగా ఉందని వివరించారు.

  రైల్వే మంత్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు

  ఒక్కోసారి సెలబ్రెటీలు చేసే పనులు నెటిజన్ల మనసులు దోచుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ఒక పని కూడా నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. కర్ణాటకలో నివాసం ఉంటున్న కిషన్ రావు అనే వ్యక్తి తన కొడుకును స్వస్థలం కేరళ రాష్ట్రానికి పంపించేందుకు రైలు ఎక్కించాడు. కొడుకును అంత దూరం ఒంటరిగా పంపించడం అదే మొదటిసారి. చాలా జాగ్రత్తలు చెప్పి.. దగ్గరుండి కొడుకును రైలెక్కించాడు. కానీ అనుకోకుండా ఆ కొడుకు సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. తండ్రి కొడుకు మొబైల్ … Read more

  కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ హామీపై వెనక్కి తగ్గిన కేంద్రం

  తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్ర‌కారం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పారని ధ్వ‌జమెత్తారు. కేంద్రం మ‌రోసారి తెలంగాణ‌కు ద్రోహం చేసింద‌ని పేర్కొన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన‌ప్ప‌టి నుంచీ తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. కాగా, ఇటీవ‌ల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేసే అవ‌కాశం లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.