అల్లరి నరేశ్ జోడీగా ఆ మలయాళి భామ
అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల ఉగ్రం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నంది సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళి భామ మిర్నా మీనన్‌ను ఎంపిక చేశారు. ఆమె ఇదివరకే తమిళ, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇదే మొదటి సినిమా. నరేశ్‌ను విజయ్ మరోసారి ఒక కొత్త పాత్రలో చూపించబోతున్నట్లుగా సమాచారం. షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.