• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భార‌త్‌లో పెరుగుతున్న హీట్‌వేవ్స్‌

  ఈ శ‌తాబ్దంలో వ‌ర్షాకాలంలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగాయి. భవిష్యత్తులో దేశం మరింత తరచుగా హీట్‌వేవ్‌లను చూడవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఉష్టోగ్ర‌త పెర‌గ‌డం కార‌ణంగా సంభ‌వించే మరణాలు తగ్గాయని పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వేడిగాలులు సాధారణంగా ఉంటాయని ప్రభుత్వం చెప్తుంది. దీనికి కార‌ణం వాతావ‌ర‌ణ మార్పులేన‌ని వెల్ల‌డించింది. హిందూ మహాసముద్రం వేడెక్కడం, భవిష్యత్తులో సంభ‌వించే జరిగే ఎల్ నినో సంఘటనలు భారతదేశంపై మరింత తరచుగా హీట్ వేవ్స్‌కు తీయ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించింది. గత రెండు దశాబ్దాలుగా వర్షాకాలంలో సగటు ఉష్ణోగ్రతలు … Read more

  TS: నేడు రాష్ట్ర‌వ్యాప్తంగా భారీవ‌ర్షాలు

  గ‌త కొన్నిరోజుల‌పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. అయితే 14, 15 తేదీల్లో త‌గ్గుముఖం ప‌ట్టిన వ‌ర్షాలు 16 నుంచి తిరిగి పుంజుకున్నాయి. అయితే నేటి నుంచి తిర‌గి మ‌ళ్లీ రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాక హెచ్చ‌రించింది. అల్ప‌పీడ‌నం కార‌ణంగా సోమ‌వారం, మంగ‌ళ‌వారం మోస్త‌రు వ‌ర్షాలు ప‌డతాయ‌ని సూచించింది.

  లేటుగా వచ్చినా విస్తారంగా వానలు

  ఈయేడు వానాకాలం సీజన్ లో నైరుతి రుతు పవనాలు అంచనా వేసిన సమయానికి రాకపోయినా..రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. బుధవారం కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు … Read more

  ఆరు రోజులు ముందుగానే దేశమంతా రుతుపవనాలు

  దేశంలో నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులుగా చురుగ్గా విస్తరిస్తున్నాయి. శనివారం ఉత్తర అరేబియా, గుజరాత్, రాజస్థాన్ తో పాటు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించాయి. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. జూలై 8 కల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఆరు రోజుల ముందుగానే వ్యాపించాయి. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున… మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని … Read more

  తెలంగాణ‌కు 48 గంట‌ల పాటు వ‌ర్ష సూచ‌న‌

  ఈరోజు, రేపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అంచ‌నావేసింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు ఆవ‌రించిన ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావంతో సోమ‌వారం, మంగ‌ళ‌వారం తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. నిన్న ఆదివారం సాయంత్రం ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షాలు ప‌డ్డాడ‌యి. రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు కూడా సాధార‌ణం కంటే 3-4 డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.

  82 ఏళ్ల త‌ర్వాత అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

  గ‌త వారం నుంచి వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. మేఘాల‌యాలోని మాసిన్‌రామ్‌లో రికార్డుస్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఎల్ల‌ప్పూడు వ‌ర్షాలు కురిసే చిర‌పుంజి ప‌క్క‌న ఉన్న మాసిన్‌రామ్‌లో 24 గంట‌ల్లో దాదాపు 1003.6 మిల్లీమీట‌ర్ల వర్షపాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇది 1940 నుంచి అక్క‌డ ఇదే అత్యధిక వర్షపాతం. మ‌రోవైపు చిరపుంజిలో 972 మిల్లిమీట‌ర్ల వ‌ర్షం ప‌డింది.

  వాన కోసం ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే!

  తెలంగాణలో మరో రెండు రోజుల తర్వాతనే రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29న కేరళ తీరాన్ని తాకిన పవనాలు…ఈనెల 8నాటికి రాష్ట్రంలోకి వస్తాయని భావించినా వేడిగాలుల కారణంగా ఆలస్యమైంది. రాష్ట్రానికి రుతుపవనాలు రావాలంటే ముందుగా రాయలసీమ, కర్ణాటకలో వర్షాలు కురవాలి కానీ ప్రస్తుతం అక్కడ ఎండలు కాస్తున్నాయి. అందువల్ల జూన్ రెండో వారంలోనూ రాష్ట్రంలో అధిక వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

  ఆలస్యమవుతున్న వానలు..ఇక వచ్చేది అప్పుడే..

  నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతోంది. సముద్రపు గాలులు బలహీన పడటంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించినట్లు హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్‌ 12 నాటికి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి ఆలస్యంతోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

  మృగ‌శిర కార్తె ప్రాముఖ్య‌త..విశేషాలు

  మృగ‌శిర కార్తెలో సూర్యుడు మృగ‌శిర న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశించ‌డంతో నైరుతి రుతుప‌వ‌నాలు వ‌స్తాయి. తొల‌క‌రి జ‌ల్లులు ప‌ల‌క‌రించ‌డంతో రైతులు పొలాలు దున్ని పంట‌లు పంట‌లు వేస్తారు. రోహిణి కార్తెలో తీవ్ర ఎండ‌లతో వేడెక్కిన వాతావ‌ర‌ణం మృగ‌శిర కార్తిలో చ‌ల్ల‌బ‌డుతుంది. ఇది 15 రోజుల‌పాటు ఉంటుంది. మొద‌టిరోజు బెల్లం ఇంగువ తింటే ఈ స‌మ‌యంలో వ‌చ్చే వ్యాదుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని న‌మ్ముతారు. ఈ కార్తెలో ఇక చేప‌ల‌ను ఎక్కువ‌గా తింటారు.భార‌త జ్యోతిస్య సాంప్ర‌దాయం ప్ర‌కారం సూర్య‌డు 27 న‌క్ష‌త్రాల‌లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు కార్తెల‌ను నిర్ణ‌యిస్తారు. ఒక్కో కార్తెలో … Read more

  TS: రాష్ట్రానికి భారీ వ‌ర్ష సూచ‌న‌

  రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల‌లో తేలిక‌పాటి నుంచి భారీగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాల‌రు రావొచ్చ‌ని హెచ్చరించింది. మే 29న కేర‌ళ తీరాన్ని తాకి నైరుతి రుతుప‌వ‌నాలు నేడు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకి విస్త‌రించాయ‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం సాయంత్రం న‌ల్గొండ‌, సంగారెడ్డి, ఖ‌మ్మం జిల్లాల్లో భారీగా వ‌ర్షం కురిసింది.