• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రశాంతంగా మునుగోడు పోలింగ్

  మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఇప్పటివరకు 11.4శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు మునుగోడులోని చండూరులో భారీగా మద్యం బాటిళ్లు, డబ్బును ఎలక్షన్ అబ్జర్వర్స్ సీజ్ చేశారు.

  మునుగోడు పోలింగ్‌కు అన్నీ రెడీ

  రేపటి మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికారులు అన్ని రెడీ చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మెటిరియల్ తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.