ఉస్మాన్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ జంట జలాశాయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. దీంతో ఈ రెండు జలాశాయాల గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.జియాగూడా వద్ద మూవీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ చాందిని బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు.