బాలకృష్ణ చిన్నకూతురితో చై పెళ్లి ?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంతను విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతని పెళ్లి గురించి ఇప్పుడో వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ చై సమంతను ప్రేమించకపోతే.. బాలకృష్ణ చిన్నకూతురితో చై వివాహం జరిగేదట. అక్కినేని, నందమూరి కుటుంబాలకు మంచి సంబంధం ఉండడంతో వీరి పెళ్లి చేయాలని నిర్ణయించారట. అయితే చై సామ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆగిపోయారట. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.