కరోనా అలర్ట్; అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు
దేశంలో కోవిడ్ కేసులు కొత్తగా నమోదు అవుతుండటంతో అన్ని విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి శాంపిల్స్ తీసుకోవాలని సూచించింది. ఆ శాంపిళ్లను జినోమ్ సీక్వెన్స్ పంపాలని పేర్కొంది. ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం అయ్యాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. కాగా దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసులు 185 నమోదయ్యాయి.