మధ్యాహ్న భోజనంలో మరిన్ని రుచులు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ మెనూ మారింది. మారిన కొత్త మెనూ నవంబర్ 21 నుంచి అమలులోకి వస్తున్నట్లు ఏపీ పాఠశాల విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా తెలిపారు. ‘గోరుముద్ద’ పథకంలో భాగంగా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు మారిన మెనూ ప్రకారం పోషకాహారం అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ ఉడికించిన కోడిగుడ్డును విద్యార్థులకు తప్పనిసరిగా అందించాలని ఆజ్ణాపించారు.