• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 27న టీవీల్లోకి ‘కార్తికేయ2’

    తెలుగుతో పాటు హిందీలోనూ ‘కార్తికేయ 2’ థియేటర్లలో సత్తా చాటింది. అనంతరం ఓటీటీలోకి విడుదలై అక్కడా ఎక్కువ ఆదరణను పొందింది. ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్లలోకి విడుదవుతోంది. ఈ నెల 27న జీ సినిమాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీల్లోకి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి హిందీ, తెలుగు భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్ మరోసారి అలరించాడు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించి మెప్పించింది. కృష్ణుడి కడియం కోసం అన్వేషించడమే ఈ సినిమా కథ.

    ఆగష్టు 12న నిఖిల్ ‘కార్తికేయ 2’

    యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన మూవీ ‘కార్తికేయ 2’. హర్ష, శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ముందు ఈ చిత్రాన్ని జులై 22న విడుదల చేయాలని భావించినా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.